ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ    ఓం నమః శివాయ

ATMAJYOTHI SANKSHEMA SANGHAM, A/C NO : 631205032769, BANK NAME : ICICI BANK, IFSC CODE : ICIC0006312, BRANCH : KUKATPALLY BRANCH, HYDERABAD

About Us

నమో వ్రాతపతయే । నమో గణపతయే । నమః ప్రమథ పతయే ।
నమస్తే౭_ స్తు లంబోదరాయైక దంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరమూర్తయే నమః ॥
సమస్త దేవతలకు, ప్రమథ గణములకు అధిపతియైన ఓ గణేశా! నీకు ప్రణామములు. లంబోదరుడవు, ఏకదంతము కలిగినవాడవు, సమస్త విఘ్నములను నాశనము చేయువాడవు. పరమేశ్వరుని కుమారుడవు మరియు భక్తుల కోరికలను తీర్చువాడవు అయిన ఓ వినాయకా! నీకు మేము ప్రణమిల్లుచున్నాము. అథ పురుషో హ వై నారాయణో కామయత ప్రజాః సృజేయేతి ।
నారాయణాత్‌ ప్రాణో జాయతే । మనః సర్వేంద్రియాణి చ । ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ ।
నారాయణాత్‌ బ్రహ్మో జాయతే ; నారాయణాద్‌ రుద్రో జాయతే ।
నారాయణా దింద్రోజాయతే । - నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తే ।
నారాయణా ద్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి చ ఛందాగ్‌oసి । - నారాయణాదేవ సముత్పద్యన్తే ।
నారాయణే ప్రవర్తన్తే। నారాయణే ప్రలీయన్నే ॥
పరమపురుషుడైన నారాయణుడు జీవులను సృష్టించ సంకల్పించెను. ఆ నారాయణుని నుండి ప్రాణశక్తి, మనస్సు, ఇంద్రియములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియు భూమి ఉద్భవించెను. ఇవన్నియు కలసి విశ్వముగా రూపొందెను. బ్రహ్మ, మహారుద్రుడు, ఇంద్రుడు మరియు సకల ప్రజాపతులు నారాయణుని నుండి ఆవిర్భవించిరి. ద్వాదశాదిత్యులు, ఏకాదశ రుద్రులు, అష్ట వస్తువులు, నాలుగు వేదములు మరియు సమస్త సంపదలు కూడా నారాయణుని నుండియే ఉత్పత్తి అయ్యెను. సృష్టిలోని సమస్త జీవులు, వస్తువులు నారాయణుని ను౦డి ఉత్పత్తి అయ్యెను. సృష్టి అంతయు నారాయణునిచే పోషింపబడి చివరకు నారాయణుని యందే లయమగును.

నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ - నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్టోక్యాయ చా వసాన్యాయ చ - నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ ॥
మరణము మరియు ముక్తి రూపములలోనున్న రుద్రునికి నమస్కారము. పచ్చని పంట పొలములు మరియు పండ్ల తోటలు రూపములో వున్న రుద్రునికి నమస్కారము. వేద మంత్రములు మరియు ఉపనిషత్తుల రూపములో వున్న రుద్రునికి నమస్కారము. వృక్షములు మరియు లతల రూపములో వున్న రుద్రునికి నమస్కారము. ధ్వని, ప్రతిధ్వనులు రెండింటి రూపముగానున్న రుద్రునికి నమస్కారము. శం చ మే మయశ్చ మే ప్రియం చ మే ను కామశ్చ మే
కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే
వశ్యస్చ మే యశస్చ మే భగశ్చ మే ద్రవిం చ మే యన్తా చ మే ధర్తా చ మే
క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మమశ్చ మే సంవిచ్చ మే ॥
నాకు ఇహ, పర సుఖములు లభించునట్లు అనుగ్రహింపుము. ఇహ, పరలోకములలో నాకు ఆనందమును కలుగచేయు మంచి వస్తువులను ప్రసాదించుము. సర్వులతోను సత్సంబంధములు కలిగియుండటం ద్వారా కలిగే సుఖ, శాంతులు నాకు ప్రాప్తించేటట్లు అనుగ్రహించుము. ఇహలోకములో క్షేమ స్థైర్యములు మరియు సిరిసంపదలు, పరలోకములో ఆధ్యాత్మిక శాంతి నాకు లభించేటట్లు అనుగ్రహింపుము. నాకు సుఖ, సౌకర్యములతో నిండిన నివాసము, ధనము, సంపద, మరియు కీర్తిని ప్రసాదించుము. జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ
ఋతం చమే మృతం చ మే యక్ష్మం చ మే నామయశ్చ
మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే నవింత్రం చ మే భయం
చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ॥
వాత్సల్య భావముతో నాకు తమ సలహా సంప్రదింపులనొసగి, నా తప్పులను దిద్ది, నన్ను సన్మార్గములో ముందుకు నడిపించగల పెద్దలు మరియు ఆచార్యులు నాకు లభించేటట్లు అనుగ్రహింపము. కష్టకాలములో నాకు అండగా నిల్చి నన్ను ఆదుకోగలిగిన తల్లిదండ్రులు మరియు పెద్దలు నాకు లభించునట్లు నన్ను అనుగ్రహింపుము. నేను సంపాదించుకున్న ఆస్తిపాస్తులను నిలబెట్టుకోగల శక్తి సామర్ధ్యములను నాకు ప్రసాదింపుము. జీవితములో కష్టనష్టాలను ధైర్యముగా ఎదుర్కొనగల శక్తిని, పట్టుదలను నాకు ప్రసాదించుము. నేను అందరి మన్ననలను, గౌరవమును పొందగల్గునట్లు నన్ననుగ్రహింపుము. వేదశాస్త్రములను అధ్యయనం చేసి అందలి జ్ఞాన సంపదను అందరికి పంచగలిగే సామర్థ్యమును నాకు ప్రసాదించుము. నా బిడ్డలు మరియు నా వద్ద పనిచేసే సేవకులు నాయందు గౌరవ మర్యాదలతో, వినయ విధేయతలతో మెలిగేటట్లు, కష్టపడి పనిచేసేటట్లు అనుగ్రహించుము. వ్యవసాయము మరియు పశుపోషణలలో నాకు జయము చేకూరునట్లు అనుగ్రహించుము. యజ్ఞ యాగాది కర్మల యొక్క పరిపూర్ణ ఫలితము నాకు చేకూరునట్టు నన్ననుగ్రహింపుము. చిన్న, పెద్ద వ్యాధులు ఏవీ నన్ను బాధింపక నా శరీరము మంచి ఆరోగ్యవంతమైనదిగా ఉండునట్లును, నేను దీర్హకాలము జీవించుటకు అవసరమైన ఓషధులు, మరియు మందులు నా స్వాధీనములో ఉండేటట్లు వాటిని గురించిన పరిపూర్మమైన జ్ఞానము నాకు లభించేటట్లు అనుగ్రహింపుము. నాకు అకాల మృత్యువు సంభవించకుండ నన్ను రక్షించి కాపాడుము. భయము, శత్రుత్వముల నుండి నన్ను విముక్తుని చేయుము. సర్వజనులకు ఆమోదయోగ్యమైన ధర్మనిరతితో నేను వర్తించుదునుగాక! నేను సంతోషముగా నిద్రలేచి, రోజంతా ఫలప్రదమైన కార్యక్రమములు నెరవేర్చి, చివరకు రాత్రి భాగమందు ప్రశాంతముగా సుఖనిద్రను పొందునట్లు నన్ను అనుగ్రహింపుము.

Rules & Regulations

  • బ్యాంకు ఎక్కౌంటు :

    బ్యాంకు నందు సొమ్ము వేయుట, తీయుట చేయునప్పుడు అధ్యక్షులు మరియు కోశాధికారి జాయింటు సంతకములతో చేయవలయును.

  • సంఘ సాంవత్సరిక మాసముు :

    ప్రతిసంవత్సరము ఏప్రియల్ నుండి మరునటి సంవత్సరము మార్చి వరకు సంఘ సాంవత్సరిక మాసముగా పరిగణింపబడును.

  • నిధులు:

    సంఘ నిధులను సంఘ ఆశయాల సాధనకు మాత్రమే వినియోగించవలనే గాని ఏ సభ్యునకు ప్రత్యేకముగా గాని, పరోక్షముగా గాని చెందరాదు. ఇన్కంటాక్స్ ఆక్ట్ 1961 లోని సెక్షన్ 11, 12 ఎ మరియు సెక్షన్ 80 జి ప్రకారం సదరు ఇన్కంటాక్స్ డిపార్టుమెంటు వారికి టాక్సు మినహాయింపు కోరుతూ దరఖాస్తు చేయుచూ సౌసైటీ వారిని ఆధరైజ్ చేయడమైనది.

  • ఆడిట్:

    సంఘ నిధులను సంఘ సాంవత్సరిక మాసపు జమా ఖర్భులను సంఘముచే నియమించబడిన ఆడిటర్ చే ఆడిట్ చేయించవలెను.

  • Bank Account :

    To take joint signatures of President and Treasurer while deposited the amount at particular bank.

  • Annual month of Sangham :

    In every year April to next year upto March, these time period is known as Annual month of Sangham.

  • Funds :

    These funds should be belongs to maintain Aims and Ambitions of Sangham not to personals of committee members. According to Income Tax Act in 1961 Section 11, 12A and Section 80G authorised by Income Tax Department issued Tax exception from to society.

  • Audit :

    To edit funds of Sangham and Annual month expenses by the Auditor.